PDPL: ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ముత్తారం మండల ఏవో అనూష హెచ్చరించారు. ముత్తారం రైతు వేదికలో విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు నిన్న అవగాహన నిర్వహించారు. ఏవో అనూష మాట్లాడుతూ.. డీలర్లు నాణ్యమైన విత్తనాలే అమ్మాలని అన్నారు. స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్, స్టాక్ రిపోర్ట్ కచ్చితంగా పాటించాలన్నారు.