NGKL: తాడూరు మండలంలోని పాపగల్‌కు చెందిన అమీర్ (45) దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాలు.. అమీర్‌ను కొట్టి చంపిన దుండగులు, మృతదేహాన్ని కాల్చి చెరువులో పడేశారు. అమీర్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, చెరువు కట్టపై ఆయన చెప్పులు దొరికాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.