GDWL: పాఠశాలలు ప్రారంభం కాకముందే అడ్మిషన్లు చేపట్టి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డీఈవోకు వినతిపత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. పీడీఎస్ఈ జిల్లా అధ్యక్షుడు హాలింపాషా, యూఎస్ఎఫ్ఎ రాష్ట్ర సహాయ కార్యదర్శి వామన్ పల్లి రంగస్వామి పివైఎల్ జిల్లా అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.