ఎన్టీఆర్ భరోసా పథకం కింద అనకాపల్లి జిల్లాలో నిన్న సాయంత్రానికి 87.18 శాతం పింఛన్లను పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. 2,52,328 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,19,994 మందికి అంద చేసినట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో వారికి పింఛన్లు అందజేస్తామన్నారు.