MDK: మెదక్ – వెల్గతుర్తి ప్రధాన రహదారిపై నందిగామ వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జి పనులు నేటికీ పూర్తికాకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ రఘునందన్ రావు పర్యటించి ఆదేశాలిచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాయకులు ఫోటోలకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో పని శూన్యమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.