NRPT: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక సోమవారం ప్రకటనలో తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించే అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కానున్నారని చెప్పారు. ఉదయం 8 గంటలకు జాతీయ పతకాన్ని ఆవిష్కరించనున్నారు.