నల్గొండ ప్రకాశం బజార్ లోని శ్రీ లక్ష్మీ ఎలక్ట్రికల్ షాపులో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.