RBI ఉద్యోగుల సంఖ్య ఐదేళ్ల తర్వాత తొలిసారిగా తగ్గింది. 2024 చివరి నాటికి 13,520 మంది సిబ్బంది ఉండగా.. 2025 చివరి నాటికి 13,220కి పడిపోయింది. అయితే సిబ్బంది సంఖ్య తగ్గినా, ఉద్యోగులపై అయ్యే వ్యయం మాత్రం పెరిగింది. పెన్షన్ రివిజన్, పదవీ విరమణ నిధులకు అధిక కేటాయింపుల కారణంగా RBI ఉద్యోగుల వ్యయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10.8 శాతం పెరిగి రూ. 10,136 కోట్లకు చేరుకుంది.