TG: వర్షాకాల సన్నద్ధతపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో రహదారులపై ఏమాత్రం నీరు నిలిచానా తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. కొన్ని సమస్యలున్న ప్రాంతాలను గుర్తించి 15 రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. వరద కాలువల్లో పూడికను తొలగించే పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.