అన్నమయ్య: మదనపల్లిలో జరగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో డీఎస్పీ పావని ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. హిందూ, ముస్లిం సోదరులు ఐకమత్యంతో పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆమె సూచించారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్,మత పెద్దలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా చట్టాలు పాటిస్తూ సామరస్య వాతావరణాన్ని కొనసాగించాలన్నారు.