VSP: కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి విశాఖ పోర్ట్ అథారిటీని సందర్శించారు. పోర్ట్ చైర్పర్సన్ జె.ఎస్. బింద్రా మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం లాంచ్లో సింగిల్ పాయింట్ మూరింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే, పోర్టులో జరుగుతున్న ఎగుమతి-దిగుమతి కార్యకలాపాలు, ఆధునీకరణ, యాంత్రీకరణ చర్యలు, హరిత కార్యక్రమాలను తెలుసుకున్నారు.