SKLM: నరసన్నపేట మండలం కొమర్తికి చెందిన దిలీప్ కుమార్ వాట్సాప్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి, అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.52 వేలును దోచుకెళ్లారు. బాధితుడు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై గణేష్ శనివారం తెలిపారు. ప్రజలు మొబైల్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.