AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తన మంత్రిత్వ శాఖ నుంచి అన్నీ క్లియర్ అయినట్లు అమిత్ షా చెప్పారని వెంకయ్యనాయుడు తెలిపారు.