TG: మైనింగ్ అంశంపై ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించామని, మళ్లీ హౌస్ కమిటీ అవసరం లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని నేరుగా సీఐడీకి అందజేయవచ్చని సూచించారు. కేవలం నిరసనలతో సభను అడ్డుకోవడం సరికాదని విపక్షాల తీరును తప్పుబట్టారు. విచారణ జరుగుతున్న తరుణంలో రాద్ధాంతం చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు.