AP: తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసమే TDP పుట్టిందని మంత్రి లోకేష్ అన్నారు. TDP 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు చెప్పారు. ‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నినదించిన NTR స్ఫూర్తితో TDP పేద ప్రజలకు అండగా నిలిచింది. పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు రాజకీయ, సామాజిక గుర్తింపు వచ్చింది’ అంటూ ట్వీట్ చేశారు.