MDK: యోగా నిత్యజీవితంలో అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్లో ఇవాళ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా, కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. యోగ ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చని, రోజు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని తెలిపారు.