VSP: మధురవాడ మిధిలాపురి కాలనీలో మట్టల ఆదివారం సందర్భంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ట్రినిటీ లూథరన్ చర్చి పాస్టర్ ఎస్. ప్రసాద్ రావు ఆధ్వర్యంలో భక్తులు మట్టలు పట్టుకుని ‘హోసన్నా’ నినాదాలతో ఊరేగించారు. యేసు క్రీస్తు యెరూషలేము ప్రవేశాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.