ATP: గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ శ్రీ మహాలక్ష్మి సమేత గద్దెరాళ్ల తిమ్మప్ప స్వామి ఆలయంలో ఆదివారం కామధ ఏకాదశి పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు సుధీంద్ర నాథ్ స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తులసిమాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.