PPM: గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించే వారిని గుర్తించేందుకు డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ ఎస్వి.మాధవ్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని ఈ అలవాటు మానుకుని మంచి మార్గంలో నడిచే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు నిర్మూలనకు పోలీసు శాఖ మరో ముందడుగు వేసినట్లు చెప్పారు.