సత్యసాయి: అమడుగూరు మండలంలోని గాజులవారిపల్లె గ్రామం వద్ద ఉన్న శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు తనకల్లుకు చెందిన తెలుగు యువత అధ్యక్షులు కావడి ప్రవీణ్ కుమార్, లక్ష్మీదేవి దంపతులు తమ వంతు సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా దంపతులు ఆశ్రమానికి విచ్చేసి,అక్కడ ఉన్న వృద్ధులకు బియ్యం ప్యాకెట్లు రోజువారీ అవసరాలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.