ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రోజ్గార్ మేళాకు హాజరుకానున్నారు. రైల్వేశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా ఎంపికైన యువతకు ఈ మేళా ద్వారా నియామక పత్రాలను అందజేయనున్నారు. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది.