BHPL: కాలేశ్వరంలోని సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు మిషన్ భగీరథ విభాగం విస్తృత సేవలు అందిస్తోంది. 540 తాత్కాలిక మరుగుదొడ్లు, 38 నీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. 115 మంది సిబ్బంది, నీటి ట్యాంకర్లు, క్లోరినేషన్ తనిఖీలతో భక్తులకు నిరంతర సేవలు అందిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.