SDPT: జగదేవపూర్ మండలం మునిగడప గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రోజులు గడుస్తున్నా అధికారులు ధాన్యం సేకరించకపోవడం, వడగండ్ల వానల వల్ల పంట నష్టపోయే ప్రమాదం ఉండటంతో వారు ఈ నిరసనకు దిగారు. ఎలాంటి నిబంధనలు పెట్టకుండా, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే వెంటనే కొనుగోలు చేయాలన్నారు.