KRNL: జిల్లా స్థాయి జూనియర్ హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 25న కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. 2006 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన క్రీడాకారులు మాత్రమే అర్హులన్నారు. పాల్గొనే వారు ఆధార్ కార్డు జిరాక్స్‌తో హాజరు కావాలని సూచించారు.