NLG: దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల నుంచి రైతులకు తెలియకుండానే అక్రమార్కులు ఎర్రమట్టి దొంగిలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బాధితుడు వెంకన్న ఫిర్యాదుతో కొండమల్లేపల్లిలో రెండు టిప్పర్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు. కాగా, దేవరకొండలో అక్రమంగా రవాణా చేస్తున్న మరో టిప్పర్ లారీని పోలీసులు పట్టుకున్నారు.