BDK: మణుగూరు-భద్రాచలం ప్రధాన రహదారిపై తాళ్లగోమ్మూరు క్రషర్ మిల్లు సమీపంలో ఆటో ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన ఆటో చెట్టును ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కాగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.