ప్రకాశం: కనిగిరి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని శనివారం మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. మంత్రి స్వామి మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి రోజూ యోగ సాధన చేయడం ద్వారా ఏకాగ్రత పెరగడంతో పాటు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని అన్నారు.