అన్నమయ్య: మదనపల్లిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ ప్రారంభించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు నాలుగు వారాల ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తే జరిమానాలతో పాటు అవసరమైతే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టర్, జేసీ పారిశుద్ధ కార్మికులతో కలిసి స్వయంగా చెత్త తొలగించారు.