NTR: కంచికచర్ల శాఖ గ్రంథాలయంలో శనివారం నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు వివిధ వినోదాత్మక, ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా డాన్స్ మాస్టర్ చైతన్య విద్యార్థినీ, విద్యార్థులకు డాన్స్ ప్రాక్టీస్ చేయించారు. అనంతరం మ్యూజికల్ చైర్, క్యారం బోర్డ్, చెస్, లూడో వంటి ఆటలను నిర్వహించారు.