WGL: నేడు ప్రకటించిన పాలిసెట్ ఫలితాల్లో వరంగల్ జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. నర్సంపేట మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఫర్మాన్ షా రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాధించగా, వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన నామాల లోకేశ్ 5వ ర్యాంక్ సాధించారు. వీరి విజయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.