కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం టీబీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపుకు ఎక్స్ రే పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చర్యలు చేపట్టినట్లు టీబీ నియంత్రణాధికారులు తెలిపారు.