స్టార్ హీరో సూర్య, హీరోయిన్ త్రిష జంటగా నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’(వీరభద్రుడు). ఇటీవల రిలీజైన ఈ మూవీ వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది. కేవలం తమిళనాడులోనే రూ.100 కోట్లు రాబట్టింది. గత 9 నెలలుగా ఏ తమిళ మూవీకి ఇక్కడ ఈ స్థాయి కలెక్షన్స్ రాకపోవడం విశేషం. సూర్య కెరీర్లోనే కరుప్పు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.