NTR: నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కార్యాలయ ఆవరణలో పక్షులు, కోతుల దాహాన్ని నివారించేందుకు ప్రత్యేకంగా మంచినీటి టబ్లను ఏర్పాటు చేయించారు. వేసవి తీవ్రత దృష్ట్యా జీవరాశుల పట్ల మానవత్వాన్ని చాటుతూ ఈ చర్యలు చేపట్టినట్లు ఎంపీడీవో ప్రసాదరావు తెలిపారు.