GDWL: వడ్డేపల్లి మండలం శాంతినగర్ జమ్ములమడుగు కాలనీకి చెందిన మంగలి రామకృష్ణ మృతి చెందడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. విషయం తెలుసుకున్న ‘జమ్ములమడుగు సేవాసమితి’ సభ్యులు మృతుని భార్యకు రూ.9,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సాయం కుటుంబానికి కొంత భరోసా ఇస్తుందని, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని సభ్యులు తెలిపారు.