MDK: మెదక్ పట్టణం, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ మోహన్ బాబు తెలిపారు. జాతీయ రహదారి, విద్యుత్ స్తంభాల మరమ్మతుల కారణంగా ఉదయం నుంచి పనులు ముగిసే వరకు కోత ఉంటుందన్నారు. మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు, ఔసులపల్లి,సాయినగర్, వెంకట్రావునగర్,హనుమంతరావునగర్, రషీద్ కాలనీ, గోల్కొండ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.