MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 గంటల్లో వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, అచ్చంపేట పరిసర ప్రాంతాలలో రాబోయే 4-5 గంటల్లో 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని అధికారులు సూచించారు.