SKLM: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో వడదెబ్బపై మహిళా సంఘాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని మందస వెలుగు పీవో కూర్మారావు సూచించారు. రెండుసార్లు స్థానిక మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. రైతులు, ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు ఉ.10లోపు, సా.4 గంటల తరువాత మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.