NRPT: నారాయణపేట పట్టణంలో శనివారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు వేశారు. వాహనాలు నడుపుతున్న మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ ఎస్సై కృష్ణచైతన్య మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడిపిన, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.