TPT: నాయుడుపేటకు చెందిన సామాజిక సేవకుడు గూడూరు కిషోర్ కుమార్కు సోషల్ సర్వీస్ విభాగంలో గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. పుదుచ్చేరిలో నిర్వహించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ యూనివర్సిటీ అవార్డు ప్రధానోత్సవం-2026లో ఈ పురస్కారం ప్రదానం చేశారు. సమాజ సేవలో ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ అరుదైన గౌరవం అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.