MLG: పర్యాటక కేంద్రమైన వాజేడులోని బొగత జలపాతం ప్రస్తుతం వెలవెలబోతుంది. తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన ఈ జలపాతం ఎండల తీవ్రతతో దాదాపు ఎండిపోగా, కొలనులో కొద్దిపాటి నీరు మాత్రమే కనిపిస్తోంది. సాధారణంగా పర్యాటకులతో కిటకిటలాడే ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. భానుడి భగభగలతో పర్యాటకులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదని స్థానికులు చెబుతున్నారు.