ADB: జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రత, వేడి గాలులు అధికంగా ఉన్నందున, ప్రజలందరూ వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా శనివారం సూచించారు. వేసవి కాలంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ పనులను పూర్తి చేసుకోవాలని జిల్లా ప్రజలకు తెలియజేశారు.