CTR: పెద్దపంజాణి మండలం రాయల్ పేట సయ్యద్ సైదానిమా బీబీ సాహెబ్ దర్గా ఉరుసు మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం గంధం, ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొని ప్రార్ధనలు చేశారు.