AKP: నర్సీపట్నం మండల పరిధిలో గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఎంపీపీ స్వర్ణ రాజేశ్వరి సూచించారు. శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు తాగునీరు, డ్రైనేజీలు, రహదారులు, విద్యుత్ సమస్యలను ప్రస్తావించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు.