WG: ఉమ్మడి ప.గో. జిల్లాలో గోదావరి డెల్టా ఖరీఫ్ సాగుకు జూన్ 1వ తేదీ నుంచి నీరు విడుదల చేయనున్నారు. తొలుత మే 20నే సాగునీరు విడుదల చేస్తామని ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఎప్పటిలాగే జూన్ 1 నుంచి పంట కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడటంతో రైతులు ఖరీఫ్ సాగు పనులకు సన్నద్ధమవుతున్నారు.