NZB: ప్రాధాన్యతతో కూడిన జన గణన ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్, ఆర్య నగర్ టెలికాం కాలనీలలో హౌస్ లిస్టింగ్ నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. స్వీయ గణన చేసుకున్న వారికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.