కృష్ణా: మచిలీపట్నంలో ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ ముఠాపై చిలకలపూడి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈడేపల్లిలో మొబైల్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రూ.36,865 నగదు, 8 మొబైల్ ఫోన్లు, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో 25 మంది పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.