BHPL: విలేకరులను బెదిరించడం, దాడులకు పాల్పడటం వంటి చర్యలపై తగిన మూల్యం చెల్లించక తప్పదని జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పర్కాల సమ్మయ్య గౌడ్ హెచ్చరించారు. రేగొండలో ఆయన మాట్లాడుతూ.. అక్రమాలపై వార్తలు రాసే జర్నలిస్టులను అణగదొక్కే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. జర్నలిస్టులపై దాడులు ఇకపై సహించబోమని స్పష్టం చేశారు.