WGL: జిల్లాలో తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన పింగిళి కొమురా రెడ్డి, పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దొడ్డ సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వారిని వరంగల్లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది.