AKP: భూగర్భ జలాల పెంపుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ సూచించారు. బీకెపల్లి గ్రామాన్ని డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు, కార్యదర్శి రఘురాంతో కలిసి శనివారం సందర్శించారు. మండలంలో ఐదు గ్రామాల్లో బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టేందుకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేని ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మిస్తున్నామన్నారు.