VZM: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, వారికి మెరుగైన పాలన అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. ఎల్.కోట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 137 వినతులు అందాయని తెలిపారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.